ఇలా పొదుపు చేస్తే చాలు.. ఆడవాళ్లు ఆర్థికంగా బలపడతారు..!

పొదుపు చేయాలంటే మొదట సంపాదన కూడా బాగుండాలి. అందుకే నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి. కెరీర్ లో అభివృద్ది చెందడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

దీర్ఘకాలిక సేవింగ్స్ కోసం చక్రవడ్డీలో పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం మంచిది.

సంపాదన, ఖర్చులు, పొదుపు మొదలైవాటిని ట్రాక్ చేస్తుంటే  డబ్బు వెనకేయడం సులభం.

స్టాక్ మార్కెట్, బాండ్ లు, రియల్ ఎస్టేట్ మొదలైనవాటిలో పెట్టుబడి  పెట్టేముందు తెలివిగా, అవగాహనతో ఉండటం ముఖ్యం.

ఏ కొద్ది సమయం దొరికినా ఆదాయం వచ్చే ఏదో ఒక పని చేయడం మంచిది.

లోన్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వడ్డీ రేట్లు, వడ్డీ ఇస్తున్న సంస్థ రూల్స్ వివరంగా అడిగి తెలుసుకోవాలి.

పాలసీలు, జీవిత భీమా, ఆరోగ్య భీమా వంటివి అప్పటికప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే పనిని తప్పిస్తాయి. వీటిలో పొదుపు చెయ్యాలి.

ఆర్థిక విషయాలలో మంచి అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం ద్వారా  మనీ మేనేజ్మెంట్, పొదుపు  పక్కాగా ప్లాన్ చేయవచ్చు.