ఈ జీవులు చక్కగా పాటలు కూడా పాడగలవు..!

తమ వారితో కమ్యూనికేషన్ కోసం లేదా వార్నింగ్ ఇవ్వడం కోసం కొన్ని జీవులు ప్రత్యేకమైన శబ్దాలు చేస్తాయి. 

కొన్ని జీవులు చేసే శబ్దాలు మనకు సంగీతంలా వినిపిస్తుంటాయి. అలాంటి ఆరు జంతువుల గురించి తెలుసుకుందాం.

కోకిలలు, కొన్ని ఇతర పక్షుల కూతలు అందమైన సంగీతంలా వినిపిస్తాయి. తమ భాగస్వామి కోసం అవి పాటలు పాడతాయి. 

గబ్బిలాలు చేసే సూపర్ సోనిక్ సౌండ్ గురించి తెలిసిందే. అవి ఎంత దూరంలో ఉన్న భాగస్వామికైనా వినిపించేలా పాడగలవు. 

హంప్‌బ్యాక్ వేల్స్ చాలా మెలోడియస్‌గా పాడగలవు. ఇవి తమ భాగస్వామితో కమ్యూనికేషన్ కోసం ఆ ప్రత్యక శబ్దాలు చేస్తాయి.

అత్యంత తెలివైన జంతువులైన డాల్ఫిన్లు విజిల్ లాంటి సౌండ్‌తో కమ్యూనికేట్ చేస్తాయి. 

ఆడ కప్పలను ఆకర్షించేందుకు, వర్షం వచ్చినపుడు కప్పలు చేసే వింత శబ్దాల గురించి అందరికీ తెలిసిందే. 

అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఓ ఉడుత జాతి ప్రమాదం గురించి వార్నింగ్ ఇచ్చే సమయంలో పాటలు పాడుతుంది.