థైరాయిడ్ సమస్యను నివారించే కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

బెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి

యాపిల్‌లోని పెక్టిన్ శరీరంలోని విషతుల్యాలను తొలగించి థైరాయిడ్ హార్మోన్ సమతౌల్యాన్ని కాపాడుతుంది. 

నారింజ పండ్లలోని విటమిన్ సీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి థైరాయిడ్ గ్రంథి పనితీరును నియంత్రిస్తుంది. 

అరటిలోని టైరోసిన్, బీ విటమిన్‌లు కూడా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి కీలకం

పైనాపిల్‌లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ముప్పును తగ్గిస్తాయి

ఆవకాడోలోని కొవ్వులు, మెగ్నీషియం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని సమతులీకరిస్తాయి.