ఈ ఆహారమే 56% వ్యాధులకు కారణం!

మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లే 56.4 శాతం వ్యాధులకు కారణం: ICMR 

పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్లనే ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు వస్తున్నట్లు వెల్లడి

ప్రజలు సోడియం, షుగర్ ఎక్కువ ఉండే పిజ్జా, బర్గర్, చిప్స్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారని ప్రకటన

ఇవి ప్రధానంగా వ్యాధులకు కారణం అవుతున్నాయని వెల్లడించిన ఐసీఎంఆర్

దీనికి తోడు అధిక ప్రోటీన్ కలిగిన సప్లిమెంట్లు కూడా అనారోగ్యాలకు దారితీస్తున్నాయని ప్రకటన

వీటి వాడకంతో ఎముకల్లో బలహీనత, మినరల్స్ తగ్గడం, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, ఒబేసిటీ, డయాబెటిస్ వస్తున్నాయని వెల్లడి

ఈ క్రమంలో తినే ఆహారంలో పోషకాల లోపం లేకుండా చూసుకోవాలని ICMR సూచించింది

భోజనానికి గంట ముందు నుంచి టీ, కాఫీ, కెఫీన్ కంటెంట్స్ తీసుకోవద్దని సూచన

కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు వంటివి లిమిట్‌లో ఉండేలా చూసుకోవాలని వెల్లడి