సున్నితమైన దంతాల కోసం 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆహారాన్ని నమిలి తినగలుగుతాం. చక్కని చిరునవ్వు దంతాల శుభ్రతతోనే సాధ్యం. 

సున్నితమైన దంతాల సమస్యను తగ్గించాలంటే ఇంటి చిట్కాలు పాటించవచ్చు. 

డీసెన్నిటైజింగ్ టూత్ పేస్ట్..  సున్నితమైన దంతాల కోసం టూత్ పేస్ట్ ను ఉపయోగించాలి. ఇది నరాలని నొప్పిని తగ్గిస్తుంది.

ఉప్పునీరు..  వెచ్చని ఉప్పునీటితో నీటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. 

ఆయిల్ పుల్లింగ్..  కొబ్బరినూనెను రోజూ ఉదయాన్నే పుల్లింగ్ చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తగ్గే అవకాశం ఉంటుంది.

గ్రీన్ టీ..  గ్రీన్ టీలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి సున్నితమైన దంతాలకు ఉపశమనాన్ని ఇస్తాయి. 

లవంగాలు..  ఇవి సహజమైన అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.

సాప్ట్ టూత్ బ్రష్..  మృదువైన టూత్ బ్రష్ ఉపయోగించడం వల్ల పళ్ళ మీద పెద్దగా ఒత్తిడి ఉండదు. ఇది సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. 

తెల్లబడటం..  పళ్లు తెల్లగా ఉండేందుకు వాడే పేస్ట్, పౌడర్స్ వంటివి పళ్లమీద ఒత్తిడిని పెంచుతాయి. ఇవి సున్నితమైన దంతాలకు కారణం అవుతాయి.

ఆమ్ల ఆహారాలు...  సిట్రస్ పండ్లు, పానీయాలు, సోడాలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించడం వల్ల దంతసమస్యల నుంచి రక్షించుకోవచ్చు.