తలలో జిడ్డు పోవాలంటే ఇలా చేసి చూడండి..!

జిడ్డుగల జుట్టును వదిలించుకోవాలంటే ఏడు ప్రభావంతమైన మార్గాలు ఇవే..

జుట్టులో పేరుకున్న జిడ్డును తొలగించాలంటే ప్రత్యేకమైన షాంపూని ఎంచుకోవాలి.

క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి. ఇది తలలో జిడ్డు పేరుకోకుండా చేస్తుంది. 

డ్రై షాంపూ..  పొడి షాంపూ తలలో జిడ్డును పీల్చుకునేలా చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ని నీటితో కరిగించి, షాంపూ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

ఓవర్ కండిషనింగ్..  జుట్టు మధ్య పొడవు, చివర్లకు కండీషనర్ పూసేటప్పుడు అది తల చర్మానికి అంటకుండా చూడాలి. 

హీట్ స్టైలింగ్..  అధిక వేడి స్టైలింగ్ తలలో నూనె ఉత్పత్తిని పెంచుతుంది. ఇదే తలలో జిడ్డు పెరిగేందుకు కారణం కావచ్చు.

సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా జుట్టు పరిస్థితిని ప్రభావితం చేస్తుంది.