కాలమేదైనా కొంతమందికి  పాదాల్లో చెమట రావడం సహజం

ఆ చెమటకు బ్యాక్టీరియా తోడైతే దుర్వాసన వస్తుంటుంది

షూ, సాక్సులు ధరించే వారి పాదాలకు గాలి తగలదు. 

ఫలితంగా ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది.

ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు

పాదాలను శుభ్రం చేసుకోవడానికి బేకింగ్‌ సోడాని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.

పావు బకెట్ గోరువెచ్చని నీటిలో చెంచా బేకింగ్‌ సోడా కలపాలి. ఈ మిశ్రమంలో పాదాలు మునిగేలా కొద్దిసేపు ఉంచాలి

బేకింగ్‌ సోడా ఉపయోగించడం వల్ల చెమటలోని పీహెచ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.

చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని బరకగా దంచుకోవాలి

ఒక కప్పు వేడి నీళ్లు తీసుకొని అందులో ఈ అల్లం పేస్ట్‌ని వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి

ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లారనివ్వాలి. రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమంతో పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి