చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి.  

పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందికి జుట్టు ఊడిపోవడం జరుగుతుంది

కొబ్బరినూనె, కరివేపాకు, మెంతులు,ఉల్లిపాయ నూనెకు కావాల్సిన పదర్ధాలు

పైన చెప్పిన పదార్థాలన్నీ ఓ మందపాటి పాత్రలో తీసుకుని మీడియం మంటపై అరగంట పాటు మరగనివ్వాలి.

ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టాలి. ఈ నూనెను బాటిల్‌లో నింపి.. మీకు కావాల్సినప్పుడు ఉపయోగించచ్చు.

కరివేపాకులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన తేమను అందిస్తుంది

వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా కొబ్బరి నూనె రక్షణ కలిగిస్తుంది.

మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌.. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

ఇక ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.