ఏలకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఏలకులు జీర్ణ రసాల స్రావాన్ని పెంచుతాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఏలకుల గింజలను నమలడం వల్ల మంచి శ్వాసను ఇవ్వడంతో పాటు నోటి దుర్వాసనను కూడా నివారిస్తుంది.

ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షమాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. 

ఏలకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి మంచిది.

ఏలకులు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను చంపడానికి, నోటి ఇన్ఫ్లెక్షన్లు, కావిటీలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఏలకుల టీ తాగడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ పరిస్థితుల లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. 

ఏలకుల వాసన మానసిక స్థితిని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. 

ఏలకులోని విటమిన్ సి, జింక్ వంటి విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.