ఈ అలవాట్లతో నెల రోజుల్లోనే
ఫ్యాటీ లివర్ తగ్గుతుంది..
ఫ్యాటీ లివర్ సమస్యను ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత తీవ్రమవుతుంది. వీలైనంత వరకూ ఈ సమస్య తగ్గిపోవాలంటే అలవాట్లు మార్చుకోవాలి.
కొన్ని అలవాట్ల ద్వారా చాలా సులభంగా ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.
మరి ఆ అలవాట్లు ఏంటి. ఏం చేస్తే లివర్ లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుందే వివరంగా తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ముందుగా చేయాల్సిన పని ఆల్కహాల్ ని పూర్తిగా అవాయిడ్ చేయడం. అదే సమయంలో షుగర్ ఎక్కవగా ఉండే డ్రింక్స్ నీ తాగకూడదు.
రోజూ నిద్ర లేవగానే ముందుగా చేయాల్సిన పని గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం.
పుచ్చకాయ రసం తీసుకున్నా కూడా లివర్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది.
పసుపు ఫ్యాటీ లివర్ కి మంచి మందు. చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది.
ప్రతిరోజూ 30 నిమిషాలు సాధారణ వ్యాయామం చేయడం లేదా వారానికి కనీసం 150 నిమిషాలు కసరత్తు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను అదుపులో పెట్టొచ్చు.
కంటి నిండా నిద్ర ఉంటే సగం సమస్యలు తీరిపోతాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు తప్పనిసరిగా 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు చేబుతున్నారు
Related Web Stories
ఉదయం నిద్ర లేవగానే రోజుకో గ్లాసు నీరు తాగితే 300 రోగాలకు చెక్
షుగర్ పేషెంట్స్ ముల్లంగి తింటే ఇన్ని లాభాలా..
మీ కంటి చూపు చురుగ్గా ఉండాలంటే.. ఇలా చేయండి..
ఎండు రొయ్యలు తింటున్నారా..