కరివేపాకును తీసిపారెయ్యకండి..  ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే.. 

మనం తరచుగా ఉపయోగించే కరివేపాకు డయాబెటిస్‌కు, చెడు కొలస్ట్రాల్‌కు, హై బీపీ నివారణకు మంచి ఔషధం

కరివేపాకులో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 

కరివేపాకులోని ఎంజైమ్‌లు మన జీర్ణ శక్తిని పెంచుతాయి. 

ప్రతిరోజు కరివేపాకులను నమిలితే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

కరివేపాకులో మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

కరివేపాకు జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది.

కరివేపాకులో ఉండే విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

కరివేపాకు రక్తనాళాలను శుభ్రపరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది