రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారా..  తస్మాత్ జాగ్రత్త!

ఈ డిజిటల్ యుగంలో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారు. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ చూస్తూ రాత్రిళ్లు గడుపుతున్నారు.

అయితే.. ఇలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లాన్సెంట్ ఆరోగ్య అధ్యయనంలో భాగంగా.. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో ఆయుర్దాయం తగ్గే ప్రమాదం ఉందని తేలింది.

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే.. జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకోవడం, సమస్య-పరిష్కారం వంటి అభిజ్ఞా విధులు దెబ్బతింటాయి. 

నిద్ర అస్థిరంగా ఉంటే.. ఆకలి, సంపూర్ణతను సూచించే హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం పడుతుంది. దీంతో బరువు పెరుగుతాయి.

దీర్ఘకాలిక నిద్ర లేమి రోగనిరోధక వ్యవస్థపై హానికర ప్రభావాలను కలిగిస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సామర్థ్యం తగ్గుతుంది.

రోజూ 7 గంటల కంటే తక్కువగా నిద్రపోతే.. హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని.. మధుమేహ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.