షుగర్ వ్యాధిగ్రస్తులకు లో  గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్  ఎంతో మేలు చేస్తుంది.

వాటిని తినడం వల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒకేసారి కాకుండా నెమ్మదిగా విడుదలవుతుంది.

చికెన్, మటన్, బీఫ్ మొదలైన మాంసాహారాల్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.

వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు సున్నా. ఇవి రక్తంలోకి చక్కెరను విడుదల చేయవు.

కోడి గుడ్లు కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారమే. వీటిలో ప్రోటీన్లు తప్ప కార్బోహైడ్రేట్లు పెద్దగా ఉండవు.

షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల ఆకు కూరలూ ఏంతో మేలు చేస్తాయి. దాదాపు ఆకు కూరలన్నీ లో గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఆహారాలే.

ఆపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయలు, నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి ఫలాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి.