మీరు తినే ఫుడ్స్..  ఎంత సేపటికి అరుగుతాయి..  

మనం తినే తెల్ల అన్నం అరగడానికి 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. బ్రౌన్ రైస్ అరగడానికి మాత్రం గంటన్నర పైనే పడుతుంది. 

కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే చికెన్ అరగడానికి 2-3 గంటల సమయం పడుతుంది. చేపలు అరగడానికి గంటన్నర సమయం పడుతుంది. ఇతర మాంసాహారాలు 4 గంటల్లో జీర్ణమవుతాయి.

నీటి శాతం ఎక్కువగా ఉండే టామాటా, బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలు 30-40 నిమిషాల్లో అరిగిపోతాయి. క్యారెట్, బీట్‌రూట్, ఆలూ వంటి దుంప జాతులు అరగడానికి గంట సమయం పడుతుంది. 

పెరుగు, పాలు, వెన్న వంటి పాల ఉత్పత్తులు అరగడానికి గంటన్నర సమయం పడుతుంది. ఒక గుడ్డు జీర్ణం కావడానికి 45 నిమిషాలు పైనే పడుతుంది. 

కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ అరగడానికి 5 గంటల పైనే పడుతుంది

మిల్లెట్స్, ఓట్స్ వంటివి అరగడానికి గంటన్నర సమయం పడుతుంది. చిక్కుడు, బీన్స్ వంటివి జీర్ణం కావడానికి 3 గంటలు పైన పడుతుంది. 

పండ్లరసాలు కేవలం 15-20 నిమిషాల్లోనే జీర్ణమైపోతాయి. వాటిలోని పోషకాలు చాలా స్వల్ప కాలంలో రక్తంలో కలిసిపోతాయి. 

బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటివి అరగడానికి రెండు గంటలు పైనే పడుతుంది. 

 సిట్రస్ ఫలాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు జీర్ణం కావడానికి 40 నిమిషాలు పడుతుంది.