బిగుతైన దుస్తులతో  కలిగే అనర్థాలు ఇవే..

ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే అనేక మంది బిగుతైన దుస్తులు ధరించేందుకు ఇష్టపడతారు.

ఇలా చేస్తే తాము సన్నగా అందంగా కనబడతామని కూడా అనుకుంటారు.

కొందరు జిమ్‌‌కు వెళ్లేటప్పుడు కూడా ఇలాంటి దస్తులు వేసుకుంటారు. 

 ఓ మోస్తరు బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే ఫరవాలేదు కానీ దుస్తులు మరీ టైట్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

దుస్తులు మరీ బిగుతుగా ఉన్నాయనేందుకు ప్రధాన సూచన చర్మంపై ఒత్తిడి తాలూకు చారలు ఏర్పడటమే. ముఖ్యంగా నడుము, కాళ్ల చుట్టూ ఇవి ఏర్పతాయి.

 పొట్ట చుట్టూ బిగుతైన దుస్తుల కారణంగా ఎసిడిటీ, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.

ఇది మితిమిరితే వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలకూ దారి తీయొచ్చు.