షుగర్ వ్యాధికి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్

ఈరోజుల్లో ఎక్కువ పని చేయడం, ఆహారపు అలవాట్ల కారణంగా.. యువకులు సైతం షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని సూపర్ ఫుడ్స్‌ని మన డైట్‌లో చేర్చుకుంటే చాలు. అవేంటంటే..

పసుపు: ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలకు.. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుంది.

కాకరకాయ: ఇందులో ‘చరాంటిన్’ అనే రసాయనం ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

తృణధాన్యాలు: వీటి నుంచి శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇవి రక్త ప్రవాహంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మదించేలా చేస్తాయి.

ఉసిరి: ఇందులో విటమిన్ సీ, ఫైబర్‌ ఉంటాయి. ఇది ప్యాంక్రియాస్‌ను నియంత్రిస్తూ.. రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తుంది.

మెంతులు: వీటిల్లోని ఫైబర్.. శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.