చాలా టూత్ పేస్టులలో పుదీనాను ఉపయోగిస్తుంటారు. ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపి, నోటి దుర్వాసనను పోగొడుతుంది. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతోంది.
పుదీనా టీ తాగితే రోజంతా ఎంతో ఫ్రష్‌గా, ఉల్లాసవంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఉదయం పుదీనా టీ తాగడానికి ఇష్టపడతారు.
పుదీనా సువాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు పుదినా నూనెను నుదిటికి రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
పుదీనాలో ఉండే ‘మెంథాల్’ జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
ముక్కు దిబ్బడ వేసినప్పుడు లేదా జలుము చేసినప్పుడు పుదీనా వాసన పీల్చడం వల్ల శ్వాస నాళాలు క్లీయర్ అవుతాయి. వేడి నీళ్లలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
పుదీనాలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. పుదీనా రసం రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.