పొట్టు మినపప్పుతో ఇన్ని లాభాలా..
మినపప్పు అంటేనే పోషకాల గని. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతోపాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
మినపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగు పరచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు.. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అందుకే ఈ పప్పును పోషకాల గని అని అంటారు.
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు.. మినప పప్పుతో చేసిన వంటకాలు ప్రతీ రోజు డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
పొట్టు మినపప్పుతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం.
ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు.
మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు.
ఈ పప్పు.. కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది.
మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మరింత మంచిది.
మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ పప్పుతో జుట్టు సంరక్షణకు మేలు జరుగుతుంది.
Related Web Stories
చెప్పులు లేకుండా నడవడం లాభమా ? నష్టమా?
రాత్రిపూట ఇవి తింటే గ్యాస్ సమస్యలు.. బీ కేర్ఫుల్..!
గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..
క్యాప్సికమ్ తింటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ ఖతం..