కీమోథెరపీ వల్ల కలిగే వికారాన్ని తగ్గించే సింపుల్ చిట్కా..
అల్లం టీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, విరేచనాలు తదితర సమస్యలను తగ్గిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో వచ్చే వికారం, ప్రయాణంలో వికారం తగ్గిస్తుంది.
క్యాన్సర్‌ను నివారించే క్రమంలో తీసుకునే కీమోథెరపీ వల్ల కలిగే వికారాన్ని సైతం తగ్గిస్తుంది.
కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అల్లంలో జింజెరోల్స్ అనే సమ్మేళనాలతోపాటు యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జీవక్రియను వేగవంతం చేసి.. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శరీరంలోని వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.
రక్తపోటును నియంత్రించడంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గించి, మెరుగైన నిద్రకు సహాయపడుతుంది.
జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అల్లం టీలో నిమ్మకాయ, తేనె కలపడం వల్ల మరింత ప్రయోజనాలు కలుగుతాయి.
Related Web Stories
మనసారా నవ్వండి.. ఆరోగ్యంగా జీవించండి..
కరివేపాకుతో బోలెడు ప్రయోజనాలు
బంగాళదుంప ఎక్కువగా తింటున్నారా?.. ఇది తెలుసుకోండి
పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్స్ 'రాజ్మా'