మీరు డ్రై ఫ్రూట్స్ తింటుంటే  ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

రోజువారీ ఆహారంలో బాదం, వాల్‌నట్స్ చేర్చుకోవడం వల్ల మెదడు, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

ఇవి మెదడు ఆరోగ్యానికి, గుండె జబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్‌ నియంత్రణకు ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

జీడిపప్పులో మెగ్నీషియం, జింక్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి.

ఇవి ఎముకల ఆరోగ్యం, కండరాల పనితీరును ప్రోత్సహిస్తాయి. 

ఎండుద్రాక్షలో ఇనుము, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలగా ఉంటాయి. 

ఇందులోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

ఖర్జూరాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇది అలసట, బలహీనతను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

 అంజూరలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తింటే పేగు, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.