రాత్రి నిద్రపోతున్నప్పుడు  ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణం రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం.

అయితే, రాత్రి చెమటలతో పాటు ఏవైనా ఇతర లక్షణాలను మీరు గమనించినట్లయితే డయాబెటిస్ ఉందేమో టెస్ట్ చేయించుకోండి.

ముఖ్యంగా రాత్రి సమయంలో సాధారణం కంటే ఎక్కువగా బాత్రూమ్‌కు వెళ్లడం అధిక రక్తంలో చక్కెరకు సంకేతం.

డయాబెటిస్ వల్లే రక్తం నుంచి అదనపు చక్కెరను తొలగించడానికి మీ మూత్రపిండాలు కష్టపడి పనిచేస్తాయి.

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మూత్రంలో ఎక్కువ చక్కెరను వెళ్లిపోతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన వెళ్లాల్సి వస్తుంది.

రక్త ప్రసరణ సరిగా లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళలో జలదరింపు వచ్చి తిమ్మిరి లేదా నొప్పి వస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారికి కడుపు నిండుగా తిన్నతర్వాత కూడా మళ్లీ ఏదైనా తినాలనే కోరిక కలుగుతుంది.

దీనిని డయాబెటిక్ హైపర్‌ఫేజియా లేదా పాలీఫేజియా అని కూడా అంటారు. షుగర్ ఉన్నవారు ఈ సమస్యను ఎదుర్కొంటారు.