గుడ్డులోని తెల్లసొన vs పచ్చసొన , రెండింట్లో ఏది ఆరోగ్యానికి బెస్ట్?

కొన్ని రకాల గుడ్లలో పచ్చసొన నారింజ రంగులో కనిపిస్తుంది. 

 కోడి తీసుకున్న పోషకాహారాన్ని బట్టి ఆ గుడ్డు సొన నారింజ రంగులో ఉంటుంది. కెరోటినాయిడ్లు అధికంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నటువంటి కోడి యెక్క గుడ్డులో నారింజ సొన ఉంటుంది.

 పసుపు రంగు గుడ్డుసొనతో పోల్చి చూస్తే, నారింజ రంగు గుడ్డు సొనలో అధిక పోషకాలు అధికంగా ఉంటాయి.

గుడ్డులోని పచ్చసొన ఎంత డార్క్ కలర్‌లో కనిపిస్తే అందులో అంత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

డార్క్, నారింజ రంగులోని గుడ్డుసొనలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. దీని వలన గుండె ,మెదడు పనితీరు మెరుగవుతుంది.

 పుసుపు రంగు సొన కలిగిన గుడ్డు కంటే, నారింజ రంగులో సొన కలిగిన గుడ్డు కాస్త రుచిగా ఉంటుందని భావిస్తారు.

పుసుపు మరియు నారింజ రంగు గుడ్డుసొనలు రెండింటిలో ప్రోటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.