వావ్.. పెసర మొలకలు
తింటే ఇన్ని ఉపయోగాలా?
ప్రతిరోజు పెసలును నానబెట్టుకుని మొలకలు చేసుకుని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పెసరలో మెగ్నీషియం, పొటాషియం స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నానబెట్టిన పెసరలో విటమిన్ సీ, ఈ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాటరాక్ట్స్ రాకుండా అడ్డుకుంటుంది.
పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగిన పెసర చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
నానబెట్టిన పెసర చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
నానబెట్టిన పెసరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పెసరలో కాల్షియం, పాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఎముకల, కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నానబెట్టిన పెసర పప్పును ఉదయాన్నే తింటే బరువు తగ్గుతారు. ఎక్కువ ప్రోటీన్, తక్కువ క్యాలరీలు కలిగిన పెసర రోజంతా పొట్ట నిండిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
నానబెట్టిన పెసరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Related Web Stories
ఈ ఆసనాలతో అధిక బరువుకు చెక్ పెట్టేయండి
వీళ్ళు పొరపాటున కూడా కాలీఫ్లవర్ తినకూడదు..
యోగాతో అద్భుతమైన ప్రయోజనాలు
అబ్బాయిలు రాత్రి పాలలో ఇది కలిపి తాగితే..