కాఫీ పొడితో కాంతివంతమైన చర్మం మీ సొంతం..

కాఫీ పౌడర్‌తో కేవలం కాఫీనే కాదు.. చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.

డల్ స్కిన్ ఉన్న వాళ్లు కాఫీ పౌడర్‌తో చక్కగా మెరిసి పోవచ్చు. ఈ కాఫీ పౌడర్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 

డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్స్‌కు వెళ్లే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిసిపోయేలా చేయవచ్చు.

కాఫీ పౌడర్‌తో ఈ ఫేస్ ఫ్యాక్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల్. 

కాఫీ పౌడర్‌తో చాలా రకాల ఫేస్ ప్యాక్స్ ఉంటాయి. తక్షణమే ముఖంలో గ్లో రావాలి మాత్రం ఇలా చేయాల్సిందే.

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి.

కాఫీలోని కెఫిన్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది సెల్యులైట్, ఉబ్బిన రూపాన్ని తగ్గిస్తుంది. దాంతో చర్మ కాంతివంతంగా మారుతుంది.

కాఫీ గ్రౌండ్స్ సున్నితమైన ఎక్స్‌ఫోలియెంట్‌గా పని చేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మ ఆకృతిని మృదువుగా చేయడంలో దొహదపడుతుంది. 

కాఫీలోని శోథ నిరోధక లక్షణాలు చర్మాన్ని ఉపశమనం చేయడానికి, ప్రశాంత పరచడానికి సహాయపడతుంది.

కాఫీ ఫేస్ ప్యాక్‌లు అందరికీ ఒకే విధంగా పని చేయక పోవచ్చు.

కాఫీ ఫేస్ ప్యాక్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే.. మెత్తగా రుబ్బిన కాఫీ చర్మంపై గీతలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

పెరుగు, తేనె లేదా కొబ్బరి నూనె వంటి ఇతర సహజ పదార్ధాలతో కాఫీని కలపడం వల్ల దాని ప్రయోజనాలను మరింత పెంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.