బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీలలో ఉండే సహజ వర్ణద్రవ్యం బ్లాక్ క్యారెట్ లో  ఉంటుంది. ఇది గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది.

బ్లాక్ క్యారెట్ లో ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి.

బ్లాక్ క్యారెట్ లో ఆంథోసైనిన్ లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తనాళాల పనితీరు మెరుగుపరుస్తాయి. 

బ్లాక్ క్యారెట్ లో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వీటిని మామూలు క్యారెట్ల లాగే సలాడ్లు, స్మూతీలు, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు.