పల్లీలతో కలిపి నువ్వులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..
పల్లీలు, నువ్వుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో ఎంతో ఉపయోగపడతాయి.
వీటిలో హెల్తీ ఫ్యాట్స్ (ఒమేగా-6, ఒమేగా-9) సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పల్లీల్లో ఉండే నాయసిన్, నువ్వుల్లో ఉండే సెసమిన్ కలిసి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
పల్లీలు,నువ్వులు కలిపి తినటం వల్ల విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చక్కగా ఉంచుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం లభిస్తుంది.
ఇవి కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన జింక్,ఐరన్ లాంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి.ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతోంది.
నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్ పల్లీల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడతాయి.
వీటిలో విటమిన్ బీ3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
వీటిలో కాల్షియం,మెగ్నీషియం వంటి మినరల్స్ కారణంగా ఎముకలు బలం ఉంటాయి.
పల్లీలు, నువ్వులు కలిపి తక్కువ పరిమాణంలో ప్రతి రోజు తింటే ఆకలిని కంట్రోల్ చేసి పోషకాలను అందిస్తాయి. అయితే నువ్వులు అధికంగా తింటే వేడి చేస్తాయి.కానీ ఆరోగ్యానికి చాలా మంచివి.
చాలా మంది నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి లడ్డూలుగా తయారు చేసి తింటారు.
ఇవి రోజుకు ఒకటి తినటం వల్ల జీర్ణక్రియ పెరుగుతోంది. అధిక బరువును తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.
ఇవి తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతోంది. రక్తకణాలను శుద్ధి చేస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.