సాయంత్రం టీతో  ఈ స్నాక్స్ తింటున్నారా?

సాయంత్రం టీతో పాటు సమోసాలు తినడం చాలామందికి ఇష్టం.

అయితే.. వీటిని ఎక్కువ నూనెలో వేయిస్తారు. తరచూ తీసుకుంటే శరీరంలో అధిక క్యాలరీలు చేరే అవకాశం ఉంటుంది.

సాయంత్రం టీతో పకోడీలు తినడం చాలామందికి ఇష్టం. కానీ వీటిని డీప్ ఫ్రై చేయడం వల్ల కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి.

టీతో బిస్కెట్లు తినడం చాలామందికి అలవాటు. అయితే క్రీమ్ బిస్కెట్లలో చక్కెర, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండవచ్చు.

సాయంత్రం టీతో బంగాళాదుంప చిప్స్ తింటుంటారు. వీటిలో ఉప్పు, కొవ్వు అధికంగా ఉండటంతో తరచూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

టీతో పాటు కేక్ తినడం చాలామందికి ఇష్టం. కానీ వీటిలో చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

పసుపు కలిపి తయారు చేసిన కొన్ని ఆహార పదార్థాలను కూడా టీతో కలిపి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.