Ice Apple: తాటి ముంజుల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

వేసవి కాలంలో మాత్రమే లభించే తాటి ముంజులు తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి వీటి వల్ల విటమిన్లు, జింక్, పొటాషియం లభిస్తాయని అంటున్నారు.

వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఉంటుంది.

ఇవి తీసుకోవడం వల్ల రకరకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాల అభివృద్ధిని నియంత్రిస్తాయి. 

జీర్ణ సంబంధిత వ్యాధులు దరి చేరకుండా చేస్తాయి. ఎసిడిటి సమస్యలు తగ్గుతాయి.

రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతోంది. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. మలబద్ధకం, విరేచనాల సమస్యలకు ఇవి దివ్యౌషధం.

ఇవి తీసుకుంటే..పేగుల్లో పుండ్లు సైతం నయమవుతాయి.

ఇవి తీసుకోవడం వల్ల.. ఎండాకాలంలో జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొటిమలు రాకుండా ఉండటానికి సహాయ పడుతోంది.

గర్భిణీలు ముంజలు తీసుకుంటే.. త్వరగా జీర్ణం అవుతాయి.

బాలింతల్లో తల్లిపాలు బాగా వస్తాయి. అలాగే బిడ్డకు పోషకాలు అందుతాయి.

షుగర్ పేషెంట్లు ముంజలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.