ఈ కారు అదుర్స్ .. ఒకేసారి ఛార్జ్ చేస్తే 800 కి.మీ. రేంజ్

స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియామీ నుంచి తొలిసారి వచ్చిన ఈవీ ఆకట్టుకుంటుంది

స్పీడ్‌ అల్ట్రా (SU)7 పేరుతో తెచ్చిన ఈ కారును భారతీయ మార్కెట్‌లో ప్రదర్శించారు

దీని ప్రారంభ ధర రూ.25 లక్షలు కాగా, 800 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది

కేవలం 2.78 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు

ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 265 కిలోమీటర్లని సంస్థ ప్రకటన

చైనాలో ఈ ఏడాది మార్చి నుంచి ఎస్‌యూ7 అమ్మకాలు మొదలు

దీని ధర చైనాలో టెస్లా మాడల్‌ 3 కన్నా 4 వేల డాలర్లు తక్కువే కావడం విశేషం

టెస్లా, పోర్షే ఈవీల కన్నా మించిన వేగంతో ఈ కారు వెళ్తుందంటున్న షియామీ

ఈ కారులో మొత్తం 16 యాక్టీవ్‌ సేఫ్టీ ఫీచర్లు, స్క్రీన్లుగా ట్యాబ్లెట్లను కనెక్ట్‌ చేసుకునే సౌకర్యం కలదు