పెరిగిన రిఛార్జ్ ధరలను కేంద్రం కంట్రోల్ చేస్తుందా..క్లారిటీ

ఇటీవల టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ తమ రీచార్జ్ ధరలను పెంచాయి

దీంతో ధరల పెంపుపై అనేక మంది వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుంది

ఇప్పటికే నిత్యావసరాలు సహా అనేక ధరలు పెరిగాయని కేంద్రం రీఛార్జ్ ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు

ఈ క్రమంలో పెంచిన ధరలను అదుపుచేయాలనే విషయంపై ఓ అధికారి స్పందించారు

రీఛార్జ్ ధరల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ అధికారి తెలిపారు

ప్రపంచవ్యాప్తంగా టారిఫ్‌ ధరలతో పోలిస్తే భారత్‌లోనే తక్కువగా ఉన్నాయని వెల్లడి

కంపెనీలు పెంచిన ధరలకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయని వెల్లడి

టెలికాం కంపెనీలు టారిఫ్‌లను 11-25 శాతం పెంచడంతో మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లపై ప్రభావితం పడింది

ఈ పెంచిన ధరలు జులై 3, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి