వడగాలుల ప్రభావం.. ద్రవ్యోల్బణంపై దెబ్బ!

దేశంలో ప్రస్తుతం తీవ్రమైన హీట్‌వేవ్‌ పరిస్థితి కొనసాగుతోంది

ఏప్రిల్ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరిగాయి

ఈ పరిస్థితులు మే నెలలో కూడా ఉంటాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు

ఈ వడగాలుల ప్రభావం వ్యవసాయోత్పత్తిపై ప్రభావితం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు

దీంతో ద్రవ్యోల్బణం 30 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు

హీట్‌వేవ్ కారణంగా ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి

ఈ ద్రవ్యోల్బణం జూన్ వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు

దీంతో రైతుల ఆదాయం, ఆహార ద్రవవ్యోల్బణం, ప్రజల ఆరోగ్యంపై ఈ వడగాలుల ప్రభావం చూపనుందని చెబుతున్నారు