పాత వాహనం కొంటున్నారా..  కీలక సూచన

కొత్త వాహనం కొనుగోలు చేసే స్తోమత లేనివారు పాత వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. 

అలాగే యజమాని ఏవో కారణాలతో వాహనాన్ని విక్రయిస్తాడు.

మరికొందరు దొంగిలించిన వాహనాలను సగం ధరకే అంటగట్టాలని చూస్తారు. ముఖ్యంగా చోరీ చేసిన బైక్‌లను తక్కువ ధరకే వదిలించుకోవడానికి దుండగులు వివిధ కారణాలతో నమ్మించే ప్రయత్నం చేస్తారు.

మార్కెట్‌ కంటే చాలా తక్కువ ధరకే దొరుకుతుందని కొనుగోలు చేయొద్దు.

కచ్చితంగా కొనాలనుకుంటే ఆర్‌సీపై ఉన్న ఇంజిన్‌ నంబర్, చెస్‌ నంబర్‌ను పరిశీలించాలి. వీటిని కొన్న వెంటనే యాజమాన్యపు హక్కులు పొందాలి.

కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వాహనం కొనేవారికైనా.. అమ్మేవారికైనా ముప్పు తప్పదు. కొన్ని సందర్భాల్లో కేసులు, జైళ్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

ఇవి పాటించాలి.. అమ్మేవారు అదే వాహన యజమాని అయితేనే కొనాలి.

ఆన్‌లైన్‌ చలానాలు ఉన్నాయా లేదా చూడాలి.

రిజిస్ట్రేషన్‌ పత్రాలు అసలువా.. నకిలీవా పరిశీలించాలి.

కేసుల్లో ప్రమేయం ఉన్న వాహనాలను అంటగట్టేవారుంటారు. అమ్మేవారిపై ఏమాత్రం అనుమానం వచ్చినా సమీప ఠాణాలో సమాచారం ఇవ్వాలి.

వాహనాలు కొన్నా, అమ్మినా యాజమాన్య హక్కులు మార్చుకోవాలి. పోలీసుల తనిఖీల్లో వాహనం తన పేరు మీద లేకపోవడం, ప్రమాదాలు జరగడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్‌ వర్తించదనే విషయాన్ని గమనించాలి.