మందు బాబులకు  మళ్లీ సూపర్ గుడ్ న్యూస్..  

ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 1వ తేదీన నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఉదయం10.00 గంటల నుంచి అర్థరాత్రి 12.00 గంటల వరకు బార్లు తెరచి ఉండనున్నాయి. 

దీంతో దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో దాదాపుగా ఇదే విధానం అమలు అవుతోంది. దాంతో ఆ యా నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ సైతం చేరినట్లు అయింది.

న్యూఢిల్లీ ( క్యాపిటల్ రిజియన్): బార్లు, రెస్టారెంట్లలో అర్థరాత్రి 1.00 వరకు మద్యం సరఫరా చేస్తారు.

ముంబై (మహారాష్ట్ర): అర్థరాత్రి 1:30 మూసి వేస్తారు.

చెన్నై (తమిళనాడు): అర్థరాత్రి 12.00 గంటలకు పబ్‌లు మూసివేస్తారు.

హైదరాబాద్ ( తెలంగాణ) : అర్థరాత్రి 12.00 గంటలకు మూసి వేస్తారు.

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): అర్థరాత్రి 12.00 గంటలకు బార్లు మూసివేస్తారు. 

చంఢీగఢ్ : మామూలు రోజుల్లో పబ్‌లు అర్థరాత్రి 1.00 వరకు.. వారాంతంలో మాత్రం అర్థరాత్రి 2.00 గంటల వరకు పబ్‌లు తెరచి ఉంచుతారు.

బెంగళూరు (కర్ణాటక): మామూలు రోజుల్లో రాత్రి 11.30 గంటల వరకు.. వారాంతంలో మాత్రం అంటే.. శుక్ర, శనివారాల్లో అర్థరాత్రి 1.00 గంట వరకు పబ్‌లు తెరచి ఉంచుతారు.