Home » Yuvagalam Padayatra
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా 150 రోజులకు చేరుకుంది.
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన రాజుపాలెంలో యానాదులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకి అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు రూరల్‌లో పాదయాత్ర సాగుతుంటే రద్దీ వల్ల తానే వెళ్లలేక తిరిగొచ్చినట్లు చెప్పారు. మహాశక్తితో లోకేశ్ కార్యక్రమానికి 800 మందిని అంచనా వేస్తే 3 వేల మంది వచ్చారన్నారు.
తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ 145వ రోజు యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం ఉదయం అనిల్ గార్డెన్స్‌లో ‘మహాశక్తితో లోకేష్’ పేరిట మహిళలు, యువతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు తాడిమేడు క్యాంపు సైటు నుంచి 139రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.
నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆదివారం 137వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. 136 రోజుల్లో 1770.7 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara lokesh YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ వజ్జావారిపాలెం క్యాంపు సైటులో చర్చి ఫాస్టర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. 2014లో రాష్ట్ర విభజన ఏపీ ప్రజల కోరికకాదని... కట్టుబట్టలతో బయటకి గెంటేశారని అన్నారు. కులమతాలకు అతీతంగా చంద్రబాబు పాలన సాగించారని తెలిపారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాదని.. అదో విహారయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారన్నారు. సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని అన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు లోకేష్ వెంట పాదయాత్ర చేస్తూ తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడాల లేకుండా యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో అనేక సంఘాల ప్రతినిధులు, మహిళలు, రైతులు, యువత ఇలా ఎంతో మందితో ముఖాముఖిలు, చర్చలు నిర్వహిస్తున్నారు.
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు.