Home » YSR Congress
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి.. వైద్యులకు సమాచారం అందించారు.
ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ (AP Election 2024) రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన కలకలం రేపింది.
కౌంటింగ్ ఏజెంట్ల నేర చరిత్ర తనిఖీ పేరుతో టీడీపీ కూటమి నేతల్ని ఇబ్బంది పెట్టాలని జగన్ సర్కార్ చూస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
కేడర్ అంచనాలు కాస్తంగా ఎక్కువగా కనిపిస్తున్నా అభ్యర్థులు మాత్రం సొంతంగా వేసే అంచనాలు. లెక్కలు అన్నీ ఇప్పటి వరకు ఇంకా పక్కాగా తేలలేదు. గెలుపు, ఓటమిలను పక్కనపెట్టి మెజారిటీ ఎంతనేదే అభ్యర్థుల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే పోలింగ్ ముగిసి వారం గడుస్తున్నా ఇంకా పక్కాగా లెక్క తేలలేదు. కేవలం తాము వేసుకున్న అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో సానుకూలత, వచ్చే మెజార్టీ మాత్రమే లెక్కించగలిగారు. కొంత మంది ముఖం చాటేసి ఏ రూపంలో నష్టపరిచింది కూడా లెక్క కట్టేశారు..
ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్.. ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది.
తాను అధికార దర్పాన్ని అనుభవించడానికి, ప్రతిపక్ష నేతలపై పగ సాధించడానికే జగన్మోహన్‌రెడ్డికి పదవి దక్కినట్లయింది!
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.