Home » YSR Congress
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్రంగా స్పందించారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) వైసీపీ (YSRCP) ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. ఎందుకింత ఘోరంగా ఓడిపోయామని తెలియని అయోమయ పరిస్థితి. ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మంత్రుల్లో ఏ ఒక్కరూ గెలవలేదు. తిరుగులేదనుకున్న నేతలు సైకిల్, గ్లాస్ సునామీకి చతికిలపడ్డారు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత తొలిసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు..
వైసీపీ ఘోర పరాజయంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా మీట్ నిర్వహించారు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైంది..! వైనాట్ 175 అన్న వైసీపీ ఇప్పుడు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది..! బహుశా ఇంత దారుణంగా అధికార పార్టీ ఓడిపోతుందని వైసీపీ కలలో కూడా ఊహించి ఉండదేమో.! ఈ ఓటమిని ఆ పార్టీ కార్యకర్తలు, వీరాభిమానులు.. వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...
అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెప్పినట్లుగా యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది..! అదేంటి ఘోరాతి ఘోరంగా వైసీపీ (YSRCP) ఓడిపోయింది కదా.. ఇక చూడటమేంటి..? ఇదేం విడ్డూరమనే సందేహాలు వచ్చాయ్ కదా..! అక్కడికే వస్తున్నా ఆగండి..! ఇంకెందుకు ఆలస్యం.. మీ సందేహాలన్నింటికి క్లియర్ కట్‌గా సమాధానాలు దొరకాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదివేయాల్సిందే మరి.