Home » YSR Congress
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు.
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది.
చిత్తూరు జిల్లాలో షర్మిల ప్రచార సభలు నిర్వహించిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని తాజా ఎన్నికలు నిరూపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓట్లు పెరగడం తప్ప ఏ నియోజకవర్గంలోనూ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధులకు దక్కలేదు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి.
ఘోర పరాజయంపై ఆత్మ విమర్శలేదు! అంతా ఆత్మ వంచనే! పైగా... విలువలు, విశ్వసనీయత అంటూ కాకమ్మ కబుర్లు! ఇదీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు..
మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి.. (Mandipalli Ramprasad Reddy) అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం..విధేయతను చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని. సమగ్రతను కాపాడుతానని.. బుధవారం విజయవాడలో జరిగిన చంద్రబాబునాయుడు మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో.. ప్రమాణం చేసిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డే.. ఉమ్మడి కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలలో అదృష్టవంతుడు..