Home » ys viveka murder case
మాజీ మంత్రి వివేకా మర్డర్‌పై ఆయన కూతురు సునీతా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిస్ ఫర్ వివేకా పేరుతో సునీత ప్రజెంటేషన్ ఇచ్చారు. 2009లో వైఎస్ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు.
కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ షర్మిల బరిలో దిగుతున్నారు. దీంతో ఆమె.. తన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కోరిక తీర్చబోతుందనే ఓ చర్చ అయితే కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వైరల్ అవుతోంది.
Andhrapradesh: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం ఇస్తే జగన్ ఆన్న హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకున్నారని.. మళ్ళీ వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ హంతకుడిని కాపాడుతున్నారని ఆరోపించారు.
Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తున్నాయి. ఈ సినిమాపై అభ్యంతరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో అప్రూవల్ గా ఉన్న దస్తగిరి హైకోర్టును ఆశ్రయించారు.
కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్‌ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత..
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వ్యాఖ్యలు చేసింది. ‘‘ మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు’’ అని ఆమె కోరారు. తన తండ్రి వివేకాకి జరిగినట్లు మరెవ్వరికీ జరగకూడదని, నిందితులకు శిక్షపడాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన స్మారక సభలో ఆమె మాట్లాడారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు.
సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యను నాటి విపక్ష నేత జగన్ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే(Chandrababu) హత్య చేయించారంటూ జగన్ శిబిరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేకా హత్య జగన్‌కు(YS Jagan) సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలకపాత్ర పోషించింది.