Home » Yogi Adityanath
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
ఆహారంలో కల్తీ ఘటనలపై అత్యున్నత స్థాయి సమావేశాన్ని యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేశారు. అన్ని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు సహా ఆహార విక్రయశాలలపై తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు కఠినమైన ఆదేశాలను జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో బహరాయిచ్ జిల్లాలో మనుషులపై తోడేళ్లు దాడి ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి బహరాయిచ్ సబ్ డివిజన్ పరిధిలో డాబాపై నిద్రిస్తున్న అర్మణ్ అలీ(13)పై తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
జ్ఞాన్‌వాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ల వివాదం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తొలుత ఈ మాటల యుద్ధానికి అఖిలేష్ తెరతీయగా, దేనికైనా దమ్ముండాలంటూ యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రజలంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే దేశ సాధికారత సాధ్యమని, విడిపోతే జరిగేది వినాశనమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. కొన్ని వారాలుగా హింసాత్మక నిరసనలు అట్టుడకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బలవంతంగా దేశం విడిచిపెట్టిన వెళ్లిన ఘటనను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు లేవు. రాజకీయంగా పెను మార్పులు జరిగాయి. దేశంలో అత్యధిక జనాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇండియా టుడే వార్తా సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
అయోధ్యలోని సమాజావాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ (65)తోపాటు రాజు ఖాన్‌పై లైంగిక దాడి ఘటనలో పోలీసులు కేసులో నమోదు చేశారు. 12 ఏళ్ల బాలిక కడుపులో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆమె గర్బవతి అని వైద్యులు వెల్లడించారు.