Home » Yogi Adityanath
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పష్టం చేశారు.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో హోటల్ యజమానులు, సిబ్బంది పేర్లు తప్పక ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
ఏటా లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే 'కన్వర్ యాత్ర' రూటులో తినుబండారాలకు సంబంధించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్..
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయాలు సాధించినంతవరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తుంది! కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతే.. పార్టీల్లో లోపాలు, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడతాయి.
దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
యూపీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీని నిరాశకు గురిచేయగా, దీనికి కారణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టత ఇచ్చారు. మితిమీరిన ఆత్మవిశ్వాసమే పలుచోట్ల ఓటమికి కారణమని లక్నోలో జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఎం పేర్కొన్నారు.