Home » Yadadri Temple
Telangana: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.
భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు చెన్నైలో అప్పగించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు గుట్ట మీద.. వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొత్తగా 200 గదులను నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రసాదం టికెట్లు డిజిటల్ సేవల ద్వారా అందుతున్నాయి.
యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
ఆధ్యాత్మికం, సాంస్కృతికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.