Home » West Indies Cricketers
టీమిండియా హిట్టర్ రింకు సింగ్ ఇంట విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న అతడి తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. అంతటి విషాదంలో కూడా రింకు సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌ను తన తండ్రి దర్శన్‌తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విండీస్ సాధించిన ఈ భారీ గెలుపు కారణంగా టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా.. ఆ జట్టు ప్లేయర్లు అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్2026లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు 38 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది..
న్యూజిలాండ్ స్టార్లు ప్లేయర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వేలు 95 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించారు.