• Home » West Godavari

West Godavari

Dwarka Tirumala: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

Dwarka Tirumala: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

YCP: ఏలూరులో టీడీపీ వర్గీయులపై వైసీపీ నాయకుల దాడి

ఏలూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. 40వ డివిజన్‌లో టీడీపీ వర్గీయులపై దాడి చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్‌పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది.

AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

AP Elections: జగన్‌పై విరుచుకుపడ్డ దేవినేని ఉమా

Andhrapradesh: జిల్లాలోని బుట్టాయిగూడెం మండల టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం సమావేశమయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, పోలవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు , టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. 72 శాతం పోలవరం ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?

AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్ర సంఘటనలు.. అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సాధారణంగా ఈ సమయంలో అభ్యర్థుంతా ఎవరికి వారే విడివిడిగా, వడివడిగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటారు. ఈ తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధారణంగా ఒకచోట కలుసుకోరు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకరికి ఒకరు ఎదురైనప్పటికీ అవి ఘర్షణలకే దారి తీస్తుంటాయి. అభ్యర్థుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం.

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.

AP Elections: ఆ నియోజకవర్గాల్లో గెలుపు పక్కా.. కారణం అదే..!

AP Elections: ఆ నియోజకవర్గాల్లో గెలుపు పక్కా.. కారణం అదే..!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత.. ఏపార్టీ బలమెంత.. ఎక్కడ చూసినా ఇదే చర్చ. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కా గెలిచేదెవరో అక్కడి ప్రజలు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల పోటాపోటీ ఉంటుందంటున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే పక్కాగా టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుస్తారంటూ వైసీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. మూడు పార్టీలు కలవడంతో బలం పెరిగిందని, మరోవైపు వైసీపీపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలంతా కూటమివైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!

AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.

Election Campaign: పవన్ కళ్యాణ్ నరసాపురం పర్యటన.. భారీ ఏర్పాట్లు

Election Campaign: పవన్ కళ్యాణ్ నరసాపురం పర్యటన.. భారీ ఏర్పాట్లు

పశ్చిమ గోదావరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించ నున్నారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.

AP Elections: ఉంగుటూరులో అధిపత్యం ఎవరిది.. ?

AP Elections: ఉంగుటూరులో అధిపత్యం ఎవరిది.. ?

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గెలుపుకోసం రాజకీయ పార్టీలు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఏ నియోజకవర్గంలో పక్కాగా గెలవచ్చు.. ఏ నియోజకవర్గంలో తమకు కష్టంగా ఉందనే అంచనాలను అన్ని పార్టీలు వేస్తున్నాయి. దానికి అనుగుణంగా తమ వ్యూహాలను రచిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కూటమితో పాటు వైసీపీ తమ ప్రణాళికలను రెడీ చేశాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వగా.. క్షేత్రస్థాయిలో నాయకులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈక్రమంలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఉంగుటూరు నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Chandrababu: ముస్లింలకు జగన్‌రెడ్డి చేసింది ఏమిటి?:

Chandrababu: ముస్లింలకు జగన్‌రెడ్డి చేసింది ఏమిటి?:

ప.గో.జిల్లా: రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి