Home » West Bengal
దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో భారీ వర్షాలు కురియగా.. ముంబై, ఢిల్లీ, బెంగాల్‌లోనూ అదే తీరు కనిపిస్తోంది.
తృణమూల్ ప్రతినిధిపై కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు? ఒక పార్టీ ఏ ప్రతినిధిని పంపాలో నిర్ణయించడానికి వారు ప్రతిపక్షాలతో చర్చలు జరపాలని టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ రావడంతో కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు.
West Bengal Shocking Incident: పశ్చిమబెంగాల్‌లో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య పట్ల భర్త వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్‌లోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్‌సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.
మహాకుంభ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్‌లో అనేక మందిని ఎన్‌కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
ధులియాన్ నుంచి మాల్డాలోని సహాయక శిబిరానికి తరలిపోయిన పలు కుటుంబాలను భారీ భద్రత మధ్య వెనక్కి తీసుకువస్తున్నారు. భాగీరథీ నది మీదుగా పడవల్లో ప్రజలను వెనక్కి తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తు్న్నాయి.
JEE topper Archisman Nandy: పరీక్షకు మూడు రోజుల ముందు ఆర్కిస్‌మ్యాన్ నాండి కారు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన మూడు రోజులకు ఆర్కిస్‌మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష రాశాడు. 99 శాతం స్కోర్ చేశాడు.
అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి యథాపూర్వ పరిస్థితి నెలకొనాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అన్నారు.
హింసాకాండ చెలరేగిన ముర్షీదాబాద్ జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జాంగిపూర్, ముర్షీదాబాద్, బహ్రాంపూర్. మూడు నియోజకవర్గాలకు టీఎంసీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాంగిపూర్‌కు ఖలీలుర్ రెహమాన్, ముర్షీదాబాద్‌కు తహెర్ ఖాన్, బహ్రాంపూర్‌కు యూసఫ్ పఠాన్ ఎంపీలుగా ఉన్నారు.