Home » West Bengal
దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. వీటిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ఎన్నికల కౌంటింగ్‌కు ముందు బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈనెల 4న కౌంటింగ్ జరుగనుండటంతో కౌంటింగ్ ఏజెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు ఆమె మాట్లాడారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‌లలో మే 2న రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
బెంగాల్‌లో అదనపు కౌంటింగ్ పరిశీలకులు, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించింది. రెగ్యులర్ కౌంటింగ్ అబ్జర్వర్లకు సాయంగా 165 మంది అదనపు కౌంటింగ్ పరిశీలకులు, 77 మంది పోలీసు పరిశీలకులను మోహరిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రకటించింది.
పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్ కోరాలని వారికి సూచించారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.