Home » Weather
Heavy Rainfall Predicted: ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.
Hyderabad Rain: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హఠాత్తుగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
దాదాపు రెండు వారాల విరామం తర్వాత నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుంది. గత నెల 29వ తేదీ తర్వాత నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ పురోగమించే వాతావరణం నెలకొంది.
Heatwaves: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇవాళ, రేపు కూడా ఎండల తీవ్రత కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు ఎండలు మండిపోబోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక వెలువరించింది.
రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి.
రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ నుంచి సిక్కింకు వెళ్లిన ఓ ఎమ్మార్వో కుటుంబ కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయింది.
కొనసాగుతున్న భారీ వర్షాల దృష్ట్యా, కేరళ అంతటా జిల్లా యంత్రాంగాలు ఇవాళ (మే 30)న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. ఇడుక్కి వంటి హై-రేంజ్ ప్రాంతాలలో రాత్రి ప్రయాణాన్ని సా. గం.7 నుండి ఉ. గం.6 వరకు నిషేధించారు.