Home » Wayanad
కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.
ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
వయనాడ్‌లో జూలై 30న కొండచరియల ఉత్పాతంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా యంత్రాంగం సోమవారంనాడు సామూహిక ఖననం నిర్వహించింది. యావద్దేశాన్ని కలిచివేసిన వయనాడ్ ఘటనలో గుర్తుపట్టని మృతదేహాల శరీర భాగాలను జిల్లాలోని పుదుమల ప్రాంతంలో పూడ్చిపెట్టారు.
సూపర్ హీరోలను సినిమాల్లో చూసే ఉంటాం. వాళ్లంతా రీల్ హీరోలైతే.. ఆపద సమయాల్లో ఆదుకుంటూ కొందరు రియల్ సూపర్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు ప్రజీష్ అనే యువకుడు.
కేరళలోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి జరిగిన భారీ ఉత్పాతం, ప్రాణనష్టంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. వయనాడ్‌లో అక్రమ గనుల తవ్వకాలు, జనవాసాల వల్లే అపార ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.
ప్రకృతి సృష్టించిన బీభత్సంతో వయనాడ్‌లో ఎటు చూసిన విషాదమే. ఇప్పటికే మృతుల సంఖ్య 365 దాటింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బీభత్సంలో చాలా కుటుంబాలు.. తమ కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నాయి. ఈ ఘటన చోటు చేసుకుని వారం రోజులవుతుంది. అయితే నేటికి తమ కుటుంబ సభ్యుల జాడ తెలియక పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విషాదంలో మృతుల సంఖ్య 365కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో 30 మంది చిన్నారులున్నారు.
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.