Home » Warangal
డ్రైవింగ్ సీట్లో కూర్చున్నోడు పూటుగా మద్యం తాగి, ఆ మత్తులో నడుపుతున్నాడు! అతడి ఈ నిర్లక్ష్యమే ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైంది! ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది.
వరంగల్: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మామునూరు వద్ద లారీ అదుపుతప్పి రెండు ఆటోలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
Maoist party: పూజార్ కంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
హనుమకొండలో ఓ ఆటోడ్రైవర్ మరో ఆటోడ్రైవర్‌ను కత్తితో పొడిచి హతమార్చిన ఘటనను స్థానికులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటన సమయంలో అక్కడున్న సుమారు 20 మంది చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకొనే ప్రయత్నమే చేయలేదు.
పట్ట పగలు.. నగరం నడిబొడ్డున.. జన సంచారంతో, వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న ప్రధాన రహదారిపై.. ఓ ఆటో డ్రైవర్‌ను మరో ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేసి చంపేశాడు.
Telangana: రాజ్‌కుమార్ ఆటోలో ఉన్న సమయంలో అతడి ప్రత్యర్థి అక్కడకు చేరుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.
Singer Madhupriya: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో గాయని మధుప్రియ పాట షూటింగ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.
కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు.
రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్.. పేరేదైనా భారీగా డబ్బులొస్తాయని ఆశపడి పెట్టుబడులు పెడితే చివరకు అప్పులే మిగిలి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.