Home » Vote
పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం 7గంటల కే ఓటర్లు బారులుతీరారు. అయితే గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఆలస్యమైనట్లు తెలిసింది. నోడల్ అధికారి చొరవతో 7-58కి ప్రారంభమైంది. ఉక్కపోత అధికంగా ఉన్నా ఓటర్లు గంటలకొద్ది కూలో నిలబడి ఓటేసి వెళ్లారు. పెనుకొండ మండలంలో ఎన్నికల నిబంధనలను ఆయా పార్టీ నాయకులు ఉల్లంఘించడంతో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నా యి.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ప్రతి కేంద్రం వ ద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం దాటిన క్యూ తగ్గలేదు. కొన్ని బూతలలో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ధర్మపురం 66వ పోలింగ్ బూతలో వైసీపీ ఏజంట్‌లు ఆలస్యంగా రావడంతో పోలింగ్ ఆ లస్యంగా రావడం, ఈవీఎం సరిగా పని చేయక పో వడంతో ఉదయం 7.26 పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
టీడీపీ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో గొడవలు సృష్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి చుట్టాళ్లా వెళ్లి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు.
ఈ ఎన్నికలో తన విజయం, రాష్ట్రం లో పార్టీ విజయం ఏకపక్షమని ఉమ్మడి అ భ్యర్థి గుమ్మనూరు జ యరాం అన్నారు.
ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఓటర్లను ఇబ్బంది పెట్టినట్లేనని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా మండలంలోని దర్గాహోన్నూరు, గోవిందవాడ, బండూరు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, నేమకల్లులలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో గల అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు వయోజనులు ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజలకు పిలుపునిచ్చింది. ఓటు హక్కు విధిగా ఉపయోగించుకోవాలని సెలబ్రిటీలు కోరారు.
Andhrapradesh: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లో ఓటర్‌పై వైసీపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపిక్ మిశ్రా స్పందించారు. ఓటర్‌పై చేయి చేసుకోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఐతా నగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఐతా నగర్‌లో ఓటరను ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు చెందిన సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలని దీపక్ మిశ్రా ఆదేశించారు.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని రామ్‌నగర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.