• Home » Vote

Vote

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్‌ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..

TG: రాజధానిలో కనిపించని యూత్‌ జోష్‌!

TG: రాజధానిలో కనిపించని యూత్‌ జోష్‌!

ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్‌ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్‌ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది.

Mahabubnagar: పోలింగ్‌ బహిష్కరణాస్త్రం!

Mahabubnagar: పోలింగ్‌ బహిష్కరణాస్త్రం!

సమస్యలు పరిష్కరించలేదంటూ.. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఆగ్రహానికి గురైన ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి పోలింగ్‌ బహిష్కరణను అస్త్రంగా ఎంచుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజులుగా టెంట్‌ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానికులు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

TS: ఓటరు అత్యుత్సాహం..

TS: ఓటరు అత్యుత్సాహం..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కొందరు ఓటర్లు అత్యుత్సాహం చూపారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండాలోని 160వ బూత్‌కు ఓటేయడానికి వచ్చిన బానోత్‌ బాలకృష్ణ..ఓటు వేస్తూ మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు.

TG: గుండెపోటుతో ఉద్యోగి, ఐదుగురు ఓటర్ల మృతి

TG: గుండెపోటుతో ఉద్యోగి, ఐదుగురు ఓటర్ల మృతి

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. గుండెపోటుతో ఓ ఎన్నికల ఉద్యోగి, ఐదుగురు ఓటర్లు మృతి చెందారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని నెహ్రూనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఏపీవోగా విఽధులు నిర్వరిస్తున్న శ్రీకృష్ణ (55) గుండెపోటుతో కుప్పకూలాడు.

TG: కొడంగల్‌లో రేవంత్‌.. చింతమడకలో కేసీఆర్‌

TG: కొడంగల్‌లో రేవంత్‌.. చింతమడకలో కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

TG: వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

TG: వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఓట్లు వేసిన తర్వాత సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

POLL : ఓటరు స్లిప్పులో తప్పుగా పోలింగ్‌ కేంద్రం

POLL : ఓటరు స్లిప్పులో తప్పుగా పోలింగ్‌ కేంద్రం

మడకశిర మన్సిపాలిటీలోని నాలుగో వార్డులో ఉన్న చాలా మంది ఓటర్లకు పోలింగ్‌ కేంద్రం ఒక చోట, ఓటు మరోచోట ఉండడంతో ఓటువేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఓటరు స్లిప్పులో పోలింగ్‌ కేంద్రం ఎంఆర్‌ఎస్‌ స్కూల్‌ అనిఉంది. వాటితో ఉదయాన్నే ఎంఆర్‌ఎస్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం (193) వద్దకు వెళ్లి గంటల కొద్ది క్యూలో ఉన్నారు. అయితే పీఓ మీ ఓటు ఉర్దూస్కూల్‌(185) పోలింగ్‌ కేం ద్రంలో ఉందని చెప్పి పంపారు.

POLL : మడకశిరలో 74.25 శాతం పోలింగ్‌

POLL : మడకశిరలో 74.25 శాతం పోలింగ్‌

చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గంలో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గం వ్యాప్తంగా 241 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగిం చుకొనేందుకు బారులు తీరారు. ఉదయం పోలింగ్‌ మందకొడిగా సాగినా మధ్యా హ్నం నుంచి పుంజుకొంది. ఉదయం 9 గంటలకు 3.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా 11 గంటలకు 29 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 46.20 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 63.40 శాతం నమోదైంది. 4 గంటలకు 66.20 శాతం, సాయంత్రం 5 గంటలకు 71.25 శాతం, 6 గంటలకు 74.25 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

POLL : రాత్రి వరకు కొనసాగిన పోలింగ్‌

POLL : రాత్రి వరకు కొనసాగిన పోలింగ్‌

పెనుకొండ నియోజకవర్గంలో సాయంత్రం 6గంటలకు 78.77శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 23,5986మంది ఓటర్లు ఉండగా ఇందులో 117952 పురుషులు, 118030మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. సమయం 9గంటలు కావస్తున్నా ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్‌శాతాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వలేకపోయారు. డీఎస్పీ బాబాజానసైద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి